కుప్పంలో మరో అమానవీయ ఘటన.. మ‌హిళ‌ను స్తంభానికి కట్టేసి

కుప్పంలో మరో అమానవీయ ఘటన.. మ‌హిళ‌ను స్తంభానికి కట్టేసి

చిత్తూరు జిల్లా (Chittoor District)లో ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం (Kuppam) నియోజకవర్గంలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల అప్పు తిరిగి చెల్లించలేదని త‌న కొడుకు ముందు ఓ మహిళ (Woman)ను చెట్టు (Tree)కు కట్టి కొట్టిన ఘటన మరువకముందే, శాంతిపురం మండలంలోని కర్లఘట్ట గ్రామం తమ్మిగానిపల్లి (Thammiganipalli)లో మరో మహిళను విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో, స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఈ ఘటన సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో జరగడం, గతంలో ఇలాంటి ఘటనలు కూడా వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై స్థానికులు, నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారని తెలుస్తోంది. కుప్పం నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్న ఇలాంటి అమానవీయ ఘటనలు చట్టం, శాంతిభద్రతల అమ‌లుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment