‘దూత 2’ షురూ.. ప్రొడ్యూసర్‌గా మారిన నాగచైతన్య

‘దూత 2’ షురూ.. ప్రొడ్యూసర్‌గా మారిన నాగచైతన్య

అక్కినేని అభిమానులకు, వెబ్ సిరీస్ లవర్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్. 2023లో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై, మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్‌తో ప్రేక్షకులను వణికించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘దూత’ (Dhootha) గుర్తుందిగా? అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) డిజిటల్ డెబ్యూగా వచ్చిన ఈ సిరీస్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడిక ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు సెకండ్ చాప్టర్ రెడీ అయిపోయింది. ‘దూత సీజన్ 2’ (Dhootha 2) అధికారిక పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయింది.

ఈ గ్రాండ్ లాంచ్ వేడుకకు కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ముఖ్య అతిథిగా విచ్చేసి, ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టి చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అయితే ఈ సీజన్-2లో అసలైన క్రేజీ ట్విస్ట్ ఏంటంటే.. మొదటి సీజన్‌లో కేవలం నటుడిగా అలరించిన నాగచైతన్య, ఈ రెండో సీజన్‌తో ‘నిర్మాత’గా కొత్త అవతారమెత్తుతున్నారు. కథపై, దర్శకుడు విక్రమ్ కుమార్ స్క్రిప్ట్‌పై ఉన్న నమ్మకంతోనే చైతూ అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామ్యంతో ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ లాంచ్ ఫొటోలను నాగచైతన్య తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేశారు. “దూత సెకండ్ చాప్టర్‌లోకి అడుగుపెడుతున్నందుకు, అలాగే ప్రొడ్యూసర్‌గా నా మొదటి అడుగు పడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక ముందుంది అసలైన మ్యాజిక్” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ‘దూత-2 కూడా బ్లాక్‌బస్టర్ అవ్వాలి అన్నా’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మొదటి సీజన్‌ను డైరెక్ట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ (Vikram Kumar) ఈ పార్ట్-2ని కూడా హ్యాండిల్ చేస్తున్నారు. శరత్ మరార్‌తో కలిసి చైతన్య ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఒరిజినల్ కాస్ట్‌లోని పార్వతి తిరువోతు (DCP క్రాంతి శెణై), ప్రియా భవానీ శంకర్ ఈ సీజన్‌లోనూ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సిరీస్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే స్ట్రీమింగ్ కానుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment