మూడు రాష్ట్రాల (Three State)కు గవర్నర్లు (Governors), లెఫ్టినెంట్ గవర్నర్‌లను (Lieutenant Governors) నియమిస్తూ రాష్ట్రపతి (President) నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
హర్యానా (Haryana రాష్ట్రానికి గవర్నర్‌గా ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్ (Ashim Kumar Ghosh)ను రాష్ట్రపతి నియమించారు. ప్రఖ్యాత విద్యావేత్తగా, అనేక విద్యాసంస్థల్లో కీలక పదవుల్లో పని చేసిన ఘోష్‌కు రాజకీయంగా పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ, విద్యా రంగంలో ఉన్న సేవల దృష్ట్యా ఈ బాధ్యత అప్పగించినట్టు అంచనా.
గోవా గవర్నర్ (Goa Governor)గా ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి (Former Union Minister) పూసపాటి అశోక్ గజపతి రాజు (Pusapati Ashok Gajapathi Raju) నియమితులయ్యారు. విశాఖపట్నం రాజకీయ కుటుంబానికి చెందిన అశోక్ గజపతి రాజు, గతంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయనకు పరిపాలనానుభవం, రాజ్యాంగ పద్ధతులపై పట్టుంది.
కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ (Ladakh)కు లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తా (Kavinder Gupta)ను రాష్ట్రపతి నియమించారు. గుప్తా జమ్మూకశ్మీర్ మాజీ ఉపముఖ్యమంత్రి. అనుభవజ్ఞుడైన నేతగా, ఆయనకు కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనలో గణనీయమైన అనుభవం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.









పిఠాపురంలో నాగబాబు.. వర్మ ఎపిసోడ్‌పై సైలెన్స్