నేను డాక్టర్‌ను కాదు.. రూమర్లకు కోమలి ప్రసాద్ కౌంటర్

నేను డాక్టర్‌ను కాదు.. రూమర్లకు కౌంటర్ ఇచ్చిన కోమలి ప్రసాద్!

Summarize with AI


తెలుగు చిత్రసీమలో నటిగా తనదైన ముద్ర వేసుకున్న కోమలి ప్రసాద్ (Komali Prasad) గురించి సోషల్ మీడియాలో ఇటీవల చక్కర్లు కొడుతున్న పుకార్ల (Rumors)పై ఆమె స్పందించారు. నటనకు (Acting) గుడ్‌బై (Goodbye) చెప్పి డాక్టర్ వృత్తి (Doctor Profession)లోకి మారిపోయిందనే అసత్య ప్రచారాలను ఆమె గట్టిగా ఖండించారు.

నటన నా జీవన విధానం: కోమలి ప్రసాద్
ఇటీవల నాని ‘హిట్ 3′(HIT-3) మూవీలో కీలక పాత్ర పోషించిన కోమలి ప్రసాద్, త్వరలో ‘శశివదనే’ (‘Sasivadane’) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె గురించి తప్పుడు వార్తలు వ్యాపించాయి. ఈ పుకార్లపై ఆమె స్వయంగా స్పందిస్తూ, “అందరికీ నమస్కారం. ఇటీవల నా గురించి డాక్టర్‌గా మారిపోయానని, నటనను పూర్తిగా వదిలేశానని కొన్ని అసత్య వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు ప్రముఖ మీడియా సంస్థలు కూడా దీనిని నిజమైందన్నట్లుగా ప్రచారం చేయడం బాధాకరం. ఇది పూర్తిగా అసత్యం” అని తేల్చి చెప్పారు.

తన నటనా ప్రస్థానం ఎన్నో కష్టాలను ఎదుర్కొని సాధించుకున్నదని, శివుని ఆశీస్సులతో అది కొనసాగుతోందని కోమలి ప్రసాద్ తెలిపారు. “ఈ రకమైన రూమర్లు నాలోనూ, నా శ్రేయోభిలాషుల్లోనూ అనవసరంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకూడదని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అందుకే ఈ పోస్ట్ ద్వారా నిజాన్ని మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. నటన నాకు ఒక్క ఉద్యోగం మాత్రమే కాదు.. అది నా జీవన విధానం. చివరి శ్వాస వరకు నేను నటనతోనే జీవించాలనుకుంటున్నాను” అని స్పష్టం చేశారు.

ప్రస్తుతం తాను కొత్త స్క్రిప్ట్‌లను ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నానని, త్వరలోనే అందరినీ గర్వపడేలా చేసే కొత్త ప్రాజెక్ట్‌ల వివరాలతో ముందుకు వస్తానని కోమలి ప్రసాద్ హామీ ఇచ్చారు. తన ప్రయాణంలో వెన్నెముకలా నిలిచిన శ్రేయోభిలాషులకు, తనను నమ్మిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment