బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్‌ (BV Pattabhiram) (75) గుండెపోటుతో హైదరాబాద్‌ (Hyderabad)లో తుదిశ్వాస విడిచారు (Passed Away). రచయితగా, ఇంద్రజాలికుడిగా, మానసిక వైద్యుడిగా ఆయన విస్తృత పేరు ప్రఖ్యాతలు పొందారు.

పట్టాభిరామ్ తెలుగుతో పాటు ఇంగ్లీష్, కన్నడ, తమిళ భాషల్లోనూ రచనలు చేశారు. ఆయన విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించడంతో పాటు, తల్లిదండ్రులకు అవగాహనా సదస్సులు కూడా నిర్వహించారు.

బీవీ పట్టాభిరామ్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీ పట్టా పొందిన తరువాత సైకాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లలో స్నాతకోత్తర పట్టా అందుకున్నారు. భారతదేశంలోనే కాకుండా.. అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్, అరబ్ దేశాలలో అనేక వర్క్‌షాపులు నిర్వహించి తన పరిజ్ఞానాన్ని పంచుకున్నారు. ఆయ‌న మృతిప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు. ప‌ట్టాభీరామ్ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment