గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్ (Ahmedabad)లో ఎయిర్ ఇండియా విమానం (Air India Flight) (విమానం నెం. AI171) టేకాఫ్ (Take-Off) అయిన కేవలం రెండు నిమిషాల్లోనే కూలిపోయిన (Crashed) ఘోర దుర్ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. విమాన ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం (Central Government)పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విమానంలో సాంకేతిక లోపంపై ఓ ప్రయాణికుడు (Passenger) తీసిన వీడియో(Video) ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం (Sardar Vallabhbhai Patel International Airport) నుంచి లండన్ (London)లోని గాట్విక్ విమానాశ్రయానికి (Gatwick Airport) బయలుదేరింది. ఎయిర్ ఇండియా విమానంలో సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. గురువారం మధ్యాహ్నం రన్‌వే 23 నుంచి టేకాఫ్ చేసిన విమానం.. కాసేపటికే 825 అడుగుల ఎత్తు నుంచి హఠాత్తుగా కిందకు జారి, విమానాశ్రయ సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ (Medical College Hostel) భవనంపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో లంచ్ టైమ్‌లో జరగడంతో సుమారు 30 మందికి పైగా మెడికోలు చనిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం.
రామ్మోహన్ నాయుడుపై విమర్శలు
ఈ ఘటనతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి (Central Civil Aviation Minister) రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu)పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమానంలో స్క్రీన్ (Screen) పనిచేయడం లేదు, ఏసీ (AC) రావడం లేదని ఓ ప్రయాణికుడి వీడియోను ఆధారంగా చేసుకొని సివిల్ ఏవియేషన్ మినిస్టర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది పూర్తిగా మంత్రి వైఫల్యమని, విమాన ప్రమాదానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రామ్మోహన్ నాయుడు విజయవాడ నుంచి అహ్మదాబాద్‌కు బయల్దేరారు. అయినప్పటికీ, ఈ ప్రమాదాన్ని పౌర విమానయాన శాఖ వైఫల్యంగా ప్రజలు భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో జరిగిన దుర్ఘటనగా పేర్కొంటూ, శాఖపరమైన నిర్లక్ష్యం, సాంకేతిక లోపాలను ప్రశ్నిస్తున్నారు.
రాజీనామా డిమాండ్
బీజేపీ (BJP) సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి (Subramanian Swamy) ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ, 1950లలో రైలు పట్టాలు తప్పినప్పుడు అప్పటి రైల్వే మంత్రి (Railway Minister) లాల్ బహదూర్ శాస్త్రి (Lal Bahadur Shastri) రాజీనామా (Resign) చేసిన నైతికతను గుర్తు చేశారు. అదే నైతిక బాధ్యతతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. “స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా విచారణ జరగాలంటే ఈ రాజీనామాలు తప్పవు. మోడీ, ఆయన సహచరులు ఇప్పటివరకు సాహసోపేతమైన ప్రచారంలో మునిగి ఉన్నారు, దీనిని తక్షణం ఆపాలి” అని సుబ్రమణ్యస్వామి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
దర్యాప్తు, ఊహాగానాలు
ప్రమాద కారణాలపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది, బోయింగ్ నుంచి సాంకేతిక బృందం సహాయం అందించనుంది. విమానం లాంగ్-హాల్ జర్నీ కోసం భారీగా ఇంధనంతో ఉండటం వల్ల పేలుడు తీవ్రత పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. విమానం బ్లాక్ బాక్స్ స్వాధీనం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
I was in the same damn flight 2 hours before it took off from AMD. I came in this from DEL-AMD. Noticed unusual things in the place.Made a video to tweet to @airindia i would want to give more details. Please contact me. @flyingbeast320 @aajtak @ndtv @Boeing_In #planecrash #AI171 pic.twitter.com/TymtFSFqJo
— Akash Vatsa (@akku92) June 12, 2025








