ఎన్నిక‌ల ప్ర‌చారంలో కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు..

ఎన్నిక‌ల ప్ర‌చారంలో కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు..

Summarize with AI

కొలంబియా రాజధాని బొగోటాలో (Bogotá, Capital of Colombia) ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సెనేటర్, అధ్యక్ష అభ్యర్థి మిగ్యుల్ ఉరిబ్ టర్బే (Miguel Uribe Turbay)పై ఓ ప్రచార ర్యాలీ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. పార్కులోని ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా ఈ దాడి జరిగింది. ఘటన జరిగిన వెంటనే మిగ్యుల్‌కు చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. బొగోటా మేయర్ కార్లోస్ గాలాన్ (Carlos Galán) ఈ ఘటనను అధికారికంగా ధృవీకరించారు. ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మిగ్యుల్‌కు చెందిన కన్జర్వేటివ్ డెమోక్రటిక్ పార్టీ (Conservative Democratic Party) ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఇది కేవలం ఓ వ్యక్తిపై దాడి మాత్రమే కాదు, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడిగా పార్టీ పేర్కొంది. ఈ ఘటన కొలంబియా ఎన్నికల రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment