‘ఇది సినిమా కాదు బ్ర‌ద‌ర్‌’.. – పవన్‌కు కాంగ్రెస్ ఎంపీ కౌంట‌ర్

'ఇది సినిమా కాదు బ్ర‌ద‌ర్‌'.. - పవన్‌కు కాంగ్రెస్ ఎంపీ కౌంట‌ర్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భువనగిరి (Bhongir) ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకులు భారత్‌లో ఉంటూ పాకిస్తాన్‌ను ప్రేమిస్తాం అంటారు. పాకిస్తాన్‌పై ప్రేమ ఉంటే భారత్‌ను వదిలి పాక్‌కు వెళ్లండి అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ ఎంపీ మండిప‌డ్డారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై చామల ఎంపీ సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యారు.

స్క్రిప్ట్ చదివే నాయకుడా?
“ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవ‌డానికి ఇది సినిమా (Movie) కాదు బ్ర‌ద‌ర్ (Brother) అంటూ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. 140 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ (Congress) పార్టీపై అసత్య ప్రచారం చేయడం సిగ్గు చేటు అంటూ మండిపడ్డారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌ని సూచించారు. బాధ్య‌త గ‌ల ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు, నాయకుడు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు.

కాంగ్రెస్ దేశాన్ని కాపాడే పార్టీ
కాంగ్రెస్ ఒక సెక్యులర్ పార్టీ (Secular Party).. భారతదేశాన్ని (India) కాపాడే పార్టీ అని ఎంపీ చామ‌ల కిర‌ణ్ అన్నారు. మోడీ (Modi) ని ప్ర‌స‌న్నం చేసుకోవాలంటే మాట‌ల‌తో కాదు.. ఢిల్లీలోని 7 రేస్ కోర్స్ రోడ్ గ‌ల ప్ర‌ధాని నివాసం వ‌ద్ద‌ డ్యాన్స్ వేసుకుంటూ కూర్చోవచ్చు.. లేదంటే రాజకీయాలు మానేసి సినిమాలు చేసుకుంటూ కూడా మోడీని సంతోష‌పెట్ట‌వ‌చ్చ‌ని అన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల మనోభావాలు దెబ్బతీయకండి. కులాలు, మ‌తాల మ‌ధ్య చిచ్చుపెడుతున్న మీ నాయ‌కుడిని నిల‌దీయండి అంటూ ప‌వ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు కాంగ్రెస్ ఎంపీ చామ‌ల‌.

ఉగ్ర‌దాడి ఎవ‌రి వైఫ‌ల్యం ప‌వ‌న్‌..?
ప‌హ‌ల్గామ్‌ (Pahalgam) లో 26 మంది ఉగ్ర‌వాదుల (Terrorists) దాడిలో చ‌నిపోయి వారం రోజులు అవుతుంద‌ని, ఉగ్ర‌వాదుల‌ను గుర్తించి అరెస్టు చేయకుండా ఏం చేస్తున్నార‌ని ప్ర‌ధాని కుర్చీలో కూర్చున్న మోడీని ప‌వ‌న్ కళ్యాణ్ ప్ర‌శ్నించాల‌న్నారు. ఉగ్ర‌దాడి కేంద్ర ప్రభుత్వ (Central Government) వైఫల్యమా? ఇంటెలిజెన్స్ (Intelligence) వైఫల్యమా? ఎవరి వైఫల్యం మూలంగా ఇదంతా జరిగిందో, కాశ్మీర్‌ (Kashmir) లో ఆర్టిక‌ల్ 370 (Article 370) పెట్టి ప్రశాంత వాతావరణం తీసుకొచ్చామ‌ని చెప్పుకునే ప్ర‌ధాన‌మంత్రే సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిర‌ణ్ డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment