నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా, శైలేశ్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హిట్ 3 (HIT 3)’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘హిట్’ యూనివర్స్‌లో ఇది మూడో చిత్రంగా నిలవనుంది. శ్రీనిధి శెట్టి ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో, చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
తాజాగా మూడో పాటను విడుదల (Released) చేసింది. “తన కోసమే నా పొగరే” సాంగ్ (Song) ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ గీతాన్ని ప్రముఖ గాయకుడు అనిరుధ్ తన గళంతో ఆలపించగా, సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ (Mickey J. Meyer) తమదైన శైలిలో స్వరాలు సమకూర్చారు. ఈ మెలోడీ నెమ్మదిగా ఫ్యాన్స్ హృదయాలను చేరుకుంటోంది. ఈ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచింది.