గాల్లో ప్రయాణిస్తున్న విమానం (Airplane) ఒక్కసారిగా నది (River) లో కుప్పకూలిపోయిన (Crashed) సంఘటన దక్షిణ థాయిలాండ్ (Southern Thailand) ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ భయానకమైన విమాన ప్రమాదానికి (Plane accident) సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. చిన్న విమానం టేకాఫ్ అయిన కాసేపటికే అనూహ్యంగా నియంత్రణ కోల్పోయి నదిలో కూలిపోయింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు పోలీసు అధికారులు (Six Police Officers) ఉన్నారు. దురదృష్టవశాత్తూ, విమానంలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతిచెందారు (Died).
సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను నదిలో నుంచి వెలికితీశారు. అనంతరం నది తీరంలోనే పోలీసులకు గౌరవ వందనం చేశారు. ఇదిలా ఉండగా, ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియో (Video) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విమానం కూలిన దృశ్యాలు భయానకంగా ఉండడంతో ప్రజలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.