హాస్టల్ భోజనంలో పురుగులు.. ఓయూ విద్యార్థుల ఆందోళ‌న‌

హాస్టల్ భోజనంలో పురుగులు.. ఓయూ విద్యార్థుల ఆందోళ‌న‌

Summarize with AI

ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University)కి చెందిన మంజీరా హాస్టల్‌లో పురుగుల భోజ‌నం విద్యార్థుల‌కు తీవ్ర ఆగ్ర‌హం తెప్పించింది. గత నెల రోజులుగా భోజనంలో పురుగులు (insects) రావడం వల్ల విద్యార్థులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. హాస్ట‌ల్ నిర్వాహ‌కుల‌పై విద్యార్థులు మండిప‌డుతున్నారు.

గతవారం ఫుడ్ పాయిజన్ (food poisoning) కారణంగా ఒక విద్యార్థి అస్వస్థతకు గురై, ఆస్ప‌త్రిలో చికిత్స పొందిన విష‌యం తెలిసిందే. క‌లుషిత ఆహారం, పురుగుల అన్నంపై అనేక‌సార్లు అధికారులకు (authorities) ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన పున‌రావృతం కాకుండా చూసుకుంటామ‌ని కంటితుడుపు మాట‌గా చెబుతున్నార‌ని, హాస్టల్ నిర్వాహకులు స‌మ‌గ్రంగా స్పందించలేదని విద్యార్థులు మండిప‌డుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment