విశ్వవిద్యాలయంలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఏకంగా కాలేజీ ప్రిన్సిపల్ (College Principal) క్లాస్ రూమ్ గోడలకు (Classroom Walls) ఆవుపేడ (Cow Dung) పూసిన సంచలన ఘటన ఢిల్లీ యూనివర్సిటీకి (Delhi University) చెందిన లక్ష్మీబాయి కాలేజీ (Lakshmibai College) లో చోటుచేసుకుంది. స్వయంగా ప్రిన్సిపల్ ప్రత్యూష్ వత్సల (Pratyusha Vatsala) తరగతి గదుల గోడలపై ఆవు పేడ పూస్తున్న వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై వింత వింత కామెంట్స్ వెల్లువెత్తుతుండగా, ఆమె క్లారిటీ ఇచ్చారు.
పరిశోధనలో భాగమే..
ఈ వీడియోపై స్పందించిన వత్సల “ఇది ఒక రీసెర్చ్ ప్రాజెక్టు (Research Project) భాగంగా చేస్తున్న పని. ఈ ప్రక్రియ ఒక వారం పాటు కొనసాగుతుంది. పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు మీతో పంచుకుంటాను” ఆమె వెల్లడించారు. ఈ ప్రయోగానికి “స్టడీ ఆఫ్ హీట్ స్ట్రెస్ కంట్రోల్ బై యూజింగ్ ట్రెడిషనల్ ఇండియన్ నాలెడ్జ్ (Study of Heat Stress Control by Using Traditional Indian Knowledge)” అనే పేరుపెట్టారు. పోర్టా క్యాబిన్లలో ఈ పరిశోధన జరుగుతోందని, గోడలకు సహజమైన బురదతో పూత వేయడం వల్ల ఎలాంటి హానీ ఉండదని వత్సల స్పష్టం చేశారు. కానీ కొంతమంది అసలు విషయాలు తెలియకుండానే తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
క్లాస్‌రూమ్స్‌ను చల్లగా ఉంచేందుకే..
ఈ ప్రయోగం వెనక ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. క్లాస్‌రూమ్‌లలో వేడి (Heat) తగ్గించి విద్యార్థులకు (Students) చల్లదనం (Coolness) కలిగించే పరిష్కారం కనుగొనడమే. “సి బ్లాక్‌లోని తరగతి గదులను చల్లబరచడానికి స్వదేశీ పద్ధతులు ఉపయోగిస్తున్నాం. త్వరలో ఈ గదుల్లో క్లాసులు జరుగుతాయి. మీ బోధన అనుభవం మరింత ఆహ్లాదకరంగా మారేలా చూసుకుంటున్నాం” అని ఆమె కాలేజీ గ్రూపులో సందేశం పంపించారు.
క్లాస్ రూమ్ గోడలకు ఆవుపేడ 🤔🤔
— Telugu Feed (@Telugufeedsite) April 14, 2025
కూలింగ్ కోసం పూసినట్లు వివరించిన ప్రిన్సిపల్ ప్రత్యూష్ వత్సల
ఢిల్లీ యూనివర్సిటీ లక్ష్మీబాయి కాలేజీలో జరిగింది ఈ సంఘటన#Delhi pic.twitter.com/5Dayra7mV3







