పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2025 సీజన్ శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమైంది. అయితే, ఈ క్రికెట్ ఉత్సవానికి ముందు ఒక భయంకరమైన ఘటన జరిగింది. ఇస్లామాబాద్ (Islamabad) లోని ప్రముఖ సెరెనా హోటల్ (Serena Hotel) లో అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఈ హోటల్లో పీఎస్ఎల్ జట్ల క్రికెటర్లు (Cricketers), సిబ్బంది తాత్కాలికంగా బస (Temporary Stay) చేసిన విషయం తెలిసిందే.
అగ్ని ప్రమాదం ఆ హోటల్ ఆరవ అంతస్తులో చెలరేగిందని స్థానిక అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది (Firefighters) తక్షణమే స్పందించి, మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల ఎవరూ గాయపడలేదు. క్రికెటర్లు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించారు.
ఈ ఘటనపై పీఎస్ఎల్ సీఈవో (CEO) సల్మాన్ నసీర్ (Salman Naseer) స్పందిస్తూ, “మంటలు హోటల్లోని మిగతా ప్రాంతాల్లోకి ప్రవేశించలేదు. అగ్నిమాపక బృందం వేగంగా స్పందించి ప్రమాదాన్ని అదుపులోకి తీసుకువచ్చింది” అని తెలిపారు. మొత్తం ఆరు ఫైర్ ఇంజిన్లు, 50 మంది సిబ్బంది మంటలను అదుపు చేయడంలో పాల్గొన్నారని, అరగంటలోనే పరిస్థితి పూర్తిగా కంట్రోల్లోకి వచ్చిందని సీడీఏ (CDA) అత్యవసర విభాగం డైరెక్టర్ జాఫర్ ఇక్బాల్ (Zafar Iqbal) స్పష్టం చేశారు. ఈ ఘటనతో తొలుత కొంత ఆందోళన నెలకొన్నా, క్రికెటర్లు సురక్షితంగా ఉండటంతో పీఎస్ఎల్ (PSL) అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆటలు యధాతథంగా జరుగనున్నట్లు అధికారికంగా వెల్లడైంది.








‘బందర్ రోడ్డుపై తేల్చుకుందాం’.. సాయికృష్ణ ఫ్యామిలీ ఓపెన్ ఛాలెంజ్