నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన ‘ఆదిత్య 369 (Aditya 369)’ టాలీవుడ్ (Tollywood) లో ఎప్పటికీ నిలిచిపోయే సైన్స్ ఫిక్షన్ క్లాసిక్ (Science Fiction Classic)గా పేరుగాంచింది. 1991లో విడుదలై, బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ సినిమా, ఇప్పుడు 4K డిజిటలైజేషన్ వెర్షన్ (4K Digitization) లో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) రూపొందించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 4న తిరిగి విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా, తాజాగా 4K రీమాస్టర్ ట్రైలర్ విడుదల చేయగా, నోస్టాల్జిక్ వాతావరణం మళ్లీ కన్నులవిందు చేస్తోంది.. బాలయ్య అభిమానులకు ఇది నిజమైన విజువల్ ట్రీట్ కానుంది.








