SRH vs DC : మ్యాచ్ ప్రారంభం

SRH vs DC : మ‌రికాసేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం

Summarize with AI

విశాఖ (Visakhapatnam) వేదిక‌గా మ‌రికాసేప‌ట్లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (Sunrisers Hyderabad) – ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మ్యాచ్ప్రారంభ‌మైంది. విశాఖలోని వైఎస్సార్‌ ఏసీఏ-వీడీసీఏ (YSR ACA-VDCA) మైదానంలో ఢిల్లీ, హైదరాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ మొద‌ట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ ఐపీఎల్ మ్యాచ్‌ను ఐసీసీ ఛైర్మన్ జైషా, మంత్రి లోకేష్, ప‌లువురు రాజ‌కీయ, సినీ ప్ర‌ముఖులు తిల‌కించ‌నున్నారు. ప్రముఖుల రాక దృష్ట్యా విశాఖ స్టేడియం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్‌ను తిలకించేందుకు అభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. మ్యాచ్ సందర్భంగా న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్షలు అమ‌లు చేస్తున్నారు. దాదాపు 1,700 మంది సిబ్బందితో స్టేడియం వ‌ద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ సీపీ శంకబ్రత బాగ్చీ (Shankar Brata Bagchi) భద్రతా ఏర్పాట్లను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఏసీఏ-వీడీసీఏ మైదానంలో 28వేల మంది మ్యాచ్‌ను వీక్షించ‌వ‌చ్చు.

Join WhatsApp

Join Now

Leave a Comment