ఇటీవల విడుదలై ‘హత్య’ సినిమా (Hathya Movie) ప్రేక్షకుల నుంచి అపూర్వ ఆదరణ పొందుతోంది. ఈ సినిమా రాష్ట్రంలోని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి (Political leader) దారుణ హత్య (Brutal Murder) దర్యాప్తును పోలి ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆరు భాషల్లో విడుదలైన ఈ సినిమాలో.. ఒక నేత హత్య కేసు దర్యాప్తు ఏ విధంగా సాగింది.. అసలు నిజాలను (Truths) కప్పిపెట్టి కేసు (Case) ను ఏ విధంగా పక్కదారి పట్టించారనే విషయాలను స్పష్టంగా చూపించే ప్రయత్నం చేశారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఆ రాజకీయ నేతను హత్య చేయాల్సిన అవసరం ఎవరెవరికి ఉంది? హత్యలో భాగస్వాములైంది ఎవరు? సాక్ష్యాధారాలను ఏ విధంగా దాచి పెట్టే ప్రయత్నం జరిగింది? అసలు నిందితులు కేసు నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు, కుట్రలు, దర్యాప్తు కీలక దశకు వచ్చినప్పుడు సిట్ అధికారులను మార్చడం వంటి విషయాలను సైంటిఫిక్ గా చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు, వారి బృందం, క్యాస్టింగ్ అభినందనీయులు.

కథ..:
దివంగత సీఎం (late CM) కు సోదరుడు (Brother), మాజీ సీఎం (former CM) కు చిన్నాన్న అయిన ఒక రాజకీయ నేత దారుణ హత్యకు గురవుతారు. తన స్వగృహంలో బాత్ రూమ్ (Bathroom) లో రక్తపు మడుగులో పడి ఉండడాన్ని పనివాళ్లు గమనిస్తారు. తర్వాత బంధువులకు తెలియజేస్తారు.. తొలుత గుండెపోటు (Heart Attack) తో చనిపోయారని ప్రచారం జరుగుతుంది. తర్వాత హత్యగా నిర్ధారించి పోలీసులు కేసు నమోదు చేస్తారు. తర్వాత సిట్ (SIT – Special Investigation Team) దర్యాప్తు జరుగుతుంది.. ఆ తర్వాత సీబీఐ (CBI – Central Bureau of Investigation) కి అప్పగిస్తారు. కేసు కొలిక్కి వచ్చే సమయానికి దర్యాప్తు అధికారిని మార్చేస్తారు. దీంతో అసలు వాస్తవాలు సమాధి అయిపోతాయి. హత్యకు గురైన రాజకీయ నేత ప్రత్యర్థి పార్టీ వారు నిందితులకు సహాయం చేస్తారు. ఈ హత్యలో అసలు నిందితులు ఆ నాయకుడి బావమరుదు (Brothers-In-Law) లేనని తేలే సమయానికి కేసు దర్యాప్తు స్తంభిస్తుంది.
హత్యకు మోటివ్స్ ఏంటి?
ఆ నాయకుడిని హత్య చేయాల్సిన అవసరం ఎవరెవరికి ఉంది? హత్యతో ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది? అనే విషయాలపై సినిమాలో స్పష్టత కనిపించింది. ఇన్నాళ్లూ ఈ విషయాలను దర్యాప్తు అధికారులు (Investigators) ఎందుకు నిర్లక్ష్యం చేశారనే ప్రశ్నలు తలెత్తుతాయి.

కుటుంబ కారణాలు..
హత్యకు గురయ్యే నాటి వరకు ఆ నేత ఒక ముస్లిం మహిళ (Muslim woman) ను రెండో పెళ్లి చేసుకున్నారని, వారికి ఒక కుమారుడు (Son) కూడా కలిగాడని కొందరు సన్నిహితులకు తప్ప బయటి ప్రపంచానికి తెలియదు. రెండో వివాహం గురించి తెలిసిన తరువాత కుటుంబం (Family) అతన్ని ఏ విధమైన వ్యతిరేకత చూపించారు. ఆ ముస్లిం మహిళపై ఎలా బెదిరింపులకు దిగారనే సన్నివేశాలను సినిమాలో చూపించారు. దర్యాప్తులో రెండో భార్య, ఆమె కుమారుడు విషయాలను ఉద్దేశపూర్వకంగా నాయకుడి కుమార్తె (Leader’s Daughter), బావమరిది (Brother-In-Law) దాచి పెట్టడాన్ని సినిమాలో చూపించారు.
క్రైం సీన్ క్లీన్ అప్..
ఆ నాయకుడి హత్య వార్త ముందుగా అతని ప్రధాన అనుచరుడికి తెలుస్తుంది. హత్యను ఆ ప్రధాన అనుచరుడు గుండెపోటు (Heart Attack) గా చిత్రించే ప్రయత్నం చేస్తాడు. పనివాళ్లపై ఒత్తిడి తెచ్చి రక్తాన్ని తుడిచివేయించడం, బాడీని బాత్ రూమ్ (Bathroom) నుంచి బెడ్ రూమ్ (Bedroom) కు షిప్ట్ చేయిండం వంటి సన్నివేశాలను సినిమాలో చూపించారు. క్రైం సీన్ ను క్లీన్ చేస్తుంటే ఆ ఊరి పోలీస్ అధికారి అడ్డు చెప్పకపోవడం, పనివాళ్లు గట్టిగా మాట్లాడటంతో అందరికీ ఇది హత్య అని తెలిసిపోతుంది. దీనిపై దర్యాప్తు అధికారులు ప్రధాన అనుచరుడిని ప్రశ్నిస్తే తమ నాయకుడి శవాన్ని చూసి దు:ఖం తట్టుకోలేక బయటికిపోయినట్లు చెబుతాడు. ఆ తరువాత జరిగిన సన్నివేశాలు సినిమాకు ప్రధానంగా నిలుస్తాయి.

నెల ముందే స్కెచ్ ..
హత్యలో ఏ1ను పోలీసులు వారి స్టైల్లో ప్రశ్నిస్తే కీలక విషయాలను బయటపెడతాడు. నాయకుడి హత్యకు నెలముందే ప్రధాన అనుచరుడు మరో ఇద్దరి నిందితులతో రహస్యంగా భేటి (Secret Meeting)పెట్టి.. మన నాయకుడిని చంపడానికి పెద్ద మొత్తానికి డీల్ (Deal) కుదిరిందని, మీకు వాటాలు ఇస్తానని చెప్పినట్లు ఏ1 చెబుతాడు. నాలుగు రోజుల తర్వాత తమ ముగ్గురికీ తలో కోటి (₹3 crore) ఇచ్చాడని చెబుతాడు. తనకు యాదవ్ (Yadav) అనే నిందితుడు బ్యాగ్లో డబ్బు తెచ్చి ఇచ్చాడని చెబుతాడు. ఆ తరువాత నాయకుడి మర్డర్ సన్నివేశాలు దర్శకుడు ఇంట్రెస్టింగ్గా చిత్రీకరించాడు.
పీఏ వాంగ్మూలం..
నాయకుడి బాత్ రూమ్లో రక్తపు మడుగులో పడి పోయి ఉండడాన్ని చూశానని.. వెంటనే ఆయన అల్లుడైన చిన్నబావమరిదికి తెలియజేశానని.. అక్కడ ఒక రక్తం మరకలతో కూడిన లెటర్ దొరికిందని పీఏ చెబుతాడు. ఆ లెటర్ గురించి ఎవరికీ చెప్పొద్దని.. ఎవరికి ఇవ్వకుండా దాచిపెట్టాలని ఆయన అల్లుడు చెప్పారని తన వాంగ్మూలంలో పీఏ (PA – Personal Assistant) పేర్కొంటారు. పోలీసులతో ప్రాబ్లం వస్తుందేమోనని అంటే.. నేను చూసుకుంటాలే అని అల్లుడు చెప్పాడని పీఏ చెబుతారు. నాయకుడి ఫోన్ ను పోలీసులకు అప్పగించినట్లు, తాను వాస్తవాలు చెబుతున్నా దర్యాప్తు అధికారులు మూడు నెలలపాటు గొడ్డును బాదినట్టు బాది వేధించారని పీఏ కొత్త సిట్ అధికారికి చెబుతారు. అంటే ఆ నేత కేసులో ఎంతో కీలకమైన ఆయన రాసినట్లుగా చెబుతున్న లేఖను దర్యాప్తు అధికారులు ఉద్దేశపూర్వకంగానే మరుగునపరిచారని, పీఏ వాంగ్మూలాన్ని కూడా పట్టించుకోలేదన్న సందేహాలను నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.
నిందితులు ఎత్తుకుపోయిన పత్రాలేంటి?
నేతను హత్య చేసే సమయంలో ఆయన ఇంట్లోని షెల్ప్ ల్లో ఏదో పత్రం కోసం తీవ్రంగా నిందితులు వెతికారని, సీల్ వేసిన పత్రాలను (Sealed Documents) ఎత్తుకుపోయారని చూపారు. అవి బెంగళూరు (Bangalore) లో విక్రయించడానికి ప్రయత్నించిన స్థలం పత్రాలా? లేక తన వాటా షేర్లను రెండో భార్య లేదా ఎవరికైనా వీలు రాస్తే వాటిని ఎత్తుకుపోయారా? అనేది కూడా దర్యాప్తులో పట్టించుకోలేదని సినిమాలో చూపారు.

నాయకుడు చనిపోవడానికి ముందు రోజు తన అన్న కుమారుడు సీఎం కావాలనే భావనతో వారి ఇంట్లో వాస్తు దోషాలు ఏమన్నా ఉన్నాయేమో అని వాస్తు సిద్ధాంతికి చూపెట్టారన్న విషయం, ఆ రోజు కూడా కుమారుడు వరుసయ్యే మరో నేత విజయం కోసం ఎన్నికల ప్రచారంలో చూపారు. కానీ రాజకీయ ప్రత్యర్థులు అవాస్తవాలతో వారినే కేసులో ఇరికించడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తుండడం గమనార్హం. సీబీఐ (CBI) కి కాకుండా సిట్ (SIT) తో ఎందుకు విచారణ జరిపించారనే దానికి సమధానంగా.. ఒక సీఎంగా ఉండి మన వ్యవస్థను మనమే నమ్మకపోతే ఎలా అంటూ ఆ నాయకుడి అన్న కుమారుడు చెప్పినట్లు చూపారు.. అది కూడా నిజమే కదా అంటూ కొందరు నెటిషన్లు అభిప్రాయపడుతున్నారు. ఇవి కాక ఆ సినిమాలో దర్యాప్తు (Investigation) లో పట్టించుకోని అనేక ఆధారాలు, సాక్ష్యాలను చూపించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ చూస్తే.. రాష్ట్రంలో ఆ ప్రముఖ రాజకీయ నాయకుడి కేసు దర్యాప్తులో అసలు విషయాలను మరుగున పరిచి రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నించినట్లు అర్థమవుతుంది.