బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం (Bangladesh Independence Day) సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) లేఖ రాశారు. ఈ లేఖ బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ (Mohammad Yunus) కు అందింది. మార్చి 26న బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా మోదీ భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలను, 1971 విముక్తి యుద్ధంలో భారతదేశం పాత్రను గుర్తు చేశారు.
భారత్ సహకారం.. బంగ్లాదేశ్ పునాది
ప్రధాని మోదీ బంగ్లా కీలక నేత షేక్ ముజిబుర్ రహ్మాన్ (Sheikh Mujibur Rahman) వారసత్వాన్ని గుర్తుచేశారు. 1971 యుద్ధం భారత్-బంగ్లాదేశ్ మైత్రికి బలమైన పునాది అని పేర్కొన్నారు. భారత హైకమిషన్ ద్వారా లేఖను పంచుకుని “ఈ రోజు మన ఉమ్మడి చరిత్ర, త్యాగాలకు నిదర్శనం” అని మోదీ పేర్కొన్నారు. ఈ లేఖ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. షేక్ హసీనా ప్రభుత్వం (Sheikh Hasina government) వైదొలిగిన తర్వాత బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం భారతదేశంపై ఘర్షణాత్మక వైఖరిని అవలంభిస్తోంది. అయితే, ఆర్థిక (Economic), వ్యూహాత్మక (Strategic) ప్రయోజనాల కోసం బంగ్లాదేశ్ మళ్లీ భారతదేశం సహాయాన్ని(India’s Assistance) కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.








