హుటాహుటిన ఢిల్లీకి సీఎం రేవంత్.. ఎందుకంటే

హుటాహుటిన ఢిల్లీకి సీఎం రేవంత్.. ఎందుకంటే

Summarize with AI

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి హస్తినకు పయనమైన ఈ ముగ్గురు నేతలు, సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానున్నట్లు సమాచారం.

ఈ ఆకస్మిక ఢిల్లీ టూర్ వెనుక ముఖ్యమైన కారణం మంత్రివర్గ విస్తరణపై చ‌ర్చ అని తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు. ఇప్పటికే ఈ అంశంపై అధిష్టానం పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు తుదినిర్ణయం వెలువడే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఉగాదికి ముందే తెలంగాణ‌లో కేబినెట్ విస్త‌ర‌ణ ఉంటుంద‌న్న చ‌ర్చ జోరందుకుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment