17 రోజుల్లో 7 అత్యాచారాలు.. మహిళల భద్రతపై ఆందోళన

17 రోజుల్లో 7 అత్యాచారాలు.. మహిళల భద్రతపై ఆందోళన

ఒడిశా (Odisha)లో మ‌హిళ‌ల భ‌ద్ర‌త (Women’s Safety) ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇంటి నుంచి చిన్నారులు, యువ‌త‌ను బ‌య‌ట‌కు పంపించాలంటే త‌ల్లిదండ్రులు భ‌య‌ప‌డే ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. అందుకు తాజాగా జ‌రిగిన సంఘ‌ట‌న‌లు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి. ఏకంగా 17 రోజుల్లో 7 అత్యాచారాలు (Rapes) జ‌రిగాయి. బీజేపీ పాలిత రాష్ట్రం (BJP Ruled State)లో మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌రువైందంటూ ప్ర‌తిప‌క్షాలు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి.

తాజాగా బర్గఢ్‌లో సంఘటన
జూలై 1న బర్గఢ్ జిల్లా (Bargarh District) భలుమారా (Bhalumara) అడవి (Forest)లో మేకలు మేపుతున్న ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో భజమాన్ భోయ్, సునంద పిహూ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

గత 17 రోజుల్లో..
జూన్ 28 – గంజాం జిల్లాలో 7వ తరగతి చదువుతున్న ఓ బాలికపై ఆమె సొంత బంధువు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు తర్వాత 22 ఏళ్ల నిందితుడు అరెస్ట్ చేశారు.

జూన్ 25 – గంజాం జిల్లాలో 17 ఏళ్ల అమ్మాయిపై ఓ ప్రైవేట్ క్లినిక్ యజమాని అత్యాచారం చేశాడు. ఘటన తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

జూన్ 19 – మయూర్‌భంజ్ జిల్లాలో ఆలయం నుంచి ఇంటికి వస్తున్న యువతిని నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.

జూన్ 18 – కియోంఝర్ జిల్లాలో 17 ఏళ్ల అమ్మాయి మృతదేహం చెట్టుకు వేలాడుతూ క‌నిపించింది. కొంద‌రు దుండ‌గులు ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

జూన్ 15 – గోపాల్‌పూర్ బీచ్‌లో ఓ కాలేజ్ విద్యార్థినిపై 10 మంది సామూహిక అత్యాచారం జ‌రిగింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

పెరుగుతున్న అత్యాచారాలు.. కరువైన భద్రత

ఈ వరుస ఘటనలు ఒడిశాలో మహిళల భద్రతపై ప్రభుత్వ వైఫల్యాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చాయి. మహిళలపై దాడులను నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment