తిరుప‌తిలో తొక్కిస‌లాట.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య‌

తిరుమ‌ల‌లో తొక్కిస‌లాట.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య‌

తిరుపతిలో తీవ్ర విషాద సంఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జ‌రిగింది. రెండు వేర్వేరు చోట్ల జ‌రిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. బైరాగిపట్టెడ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు చనిపోయారు. శ్రీనివాస అతిథి గృహం వ‌ద్ద జరిగిన తొక్కిస‌లాట‌లో ఒకరు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌లో చికిత్స పొందుతో మ‌రో ఇద్దరు మృతిచెందారు. తొక్కిసలాట ఘటనలో ఇంకో 15 మంది తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. క్ష‌త‌గాత్రులు రుయా, స్విమ్స్ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా తిరుమల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం ప‌రిమిత టోకెన్ల జారీయే ఇందుకు కార‌ణంగా తెలుస్తోంది. భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో టోకెన్ల కోసం త‌ర‌లిరావ‌డం, భ‌క్తుల కోసం క‌నీస భ‌ద్ర‌త ఏర్పాట్లు చేయ‌క‌పోవ‌డ‌మే ఈ తొక్కిస‌లాట‌కు కార‌ణంగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచి టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో వేచి ఉన్నామ‌ని భ‌క్తులు చెబుతున్నారు. క్యూలైన్ లోకి భక్తులను వదిలే క్రమంలో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకోవ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. నిజానికి గురువారం ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించుకుంది. శ్రీ‌వారి ద‌ర్శ‌న టోకెన్ల కోసం వ‌చ్చిన భ‌క్తులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది.

వైకుంఠ ఏకాద‌శి కోసం క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేశామ‌ని టీటీడీ తెలిపిన‌ప్ప‌టికీ, ఇలాంటి ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డంతో భ‌క్తులు తీవ్ర ఆగ్రహంతో ర‌గిలిపోతున్నారు. మృతుల బంధులు పోలీసులు, టీటీడీ అధికారుల‌పై మండిప‌డుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment