క‌రెంట్ షాక్‌.. 5 యూనిట్లకు ఏకంగా రూ.945 బిల్లు

క‌రెంట్ షాక్‌.. 5 యూనిట్లకు ఏకంగా రూ.945 బిల్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యుత్ చార్జీల మోత మోగుతోంది. ఇటీవ‌ల రాజ‌మండ్రిలో జ‌గ‌న్ పేరుతో న‌డుపుతున్న ఫిట్‌నెస్ సెంట‌ర్ (జిమ్‌)కు ఏకంగా ఒక కోటి 15 వేల రూపాయ‌ల క‌రెంట్ బిల్లు రావ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ జ‌ర‌గ్గా, తాజాగా నెల్లూరులో జ‌రిగిన ఘ‌ట‌న విద్యుత్ వినియోగ‌దారుల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

ఐదు యూనిట్ల విద్యుత్ వినియోగానికి ఏకంగా రూ.945 బిల్లు వచ్చిందంటే నమ్మశక్యం కాకపోవచ్చు.. కానీ ఇదే నిజమని నెల్లూరు నగరానికి చెందిన న్యాయవాది బసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరు రామ్మూర్తినగర్‌లో నారాయ‌ణ‌రెడ్డికి ఓ చిన్న దుకాణం ఉంది. ఆ దుకాణంలో ఒక చిన్న జీరో వాట్స్ బల్బు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఫిబ్రవరి నెల మొత్తానికి కేవలం 5 యూనిట్ల విద్యుత్ మాత్రమే ఖర్చు అయ్యింది.

సాధారణంగా ఈ వినియోగానికి రూ.65 మాత్రమే బిల్లు రావాలి. కానీ వివిధ అదనపు ఛార్జీలు, ఫీజుల పేరుతో మొత్తం రూ.945 బిల్లు రావ‌డం ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. దీంతో స్థానికులు సైతం ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. రాబోయేది ఎండా కాలం కావ‌డంతో జీరో వాట్స్ బ‌ల్బుకే రూ.950 బిల్లు వ‌స్తే.. ఫ్యానో, కూల‌రో, ఏసీనో వేసుకుంటే ప‌రిస్థితి ఏంట‌న్న ఆందోళ‌న అంద‌రినీలోనూ పెరిగిపోతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment