ప‌ర‌కామ‌ణి వీడియో.. లోకేష్ ట్వీట్‌పై వైసీపీ స్ట్రాంగ్ రియాక్ష‌న్‌

ప‌ర‌కామ‌ణి వీడియో.. లోకేష్ ట్వీట్‌పై వైసీపీ స్ట్రాంగ్ రియాక్ష‌న్‌

తిరుమల (Tirumala) పరకామణి (Parakamani) అంశంపై నారా లోకేష్ (Nara Lokesh) చేసిన వ్యాఖ్యలపై వైసీపీ(YSRCP) తీవ్రంగా స్పందించింది. తిరుమల వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లకు అలవాటైందని విమర్శించింది. వెంకటేశ్వరస్వామిని సాక్షిగా పెట్టుకుని అబద్ధాలు, విషప్రచారాలు చేయడం వారిద్దరికీ మాత్ర‌మే చెల్లింద‌ని ఆ పార్టీ వ్యాఖ్యానించింది.

ప‌ర‌కామ‌ణిలో చోరీ అంటూ మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్‌కు వైసీపీ ఘాటుగా స్పందించింది. ప‌రకామణిలో చోరీ ఘటన విషయంలోనూ చంద్రబాబు (Chandrababu) పచ్చి అబద్ధాలు చెబుతున్నారని వైసీపీ ట్వీట్ చేసింది. ఆ చోరీకి పాల్పడిన రవికుమార్‌ను 2023 ఏప్రిల్‌లో, వైసీపీ హయాంలోనే పట్టుకున్నారని, పోలీసులు నిశిత విచారణ జరిపిన తర్వాత రవికుమార్ (Ravikumar) కుటుంబ సభ్యులు పశ్చాత్తాపం చెంది రూ.14.43 కోట్ల విలువైన ఆస్తులను తిరిగి టీటీడీ(TTD)కి బహూకరించారని వివరించింది. ఇది చట్టప్రకారం, కోర్టు మార్గదర్శకత్వంలో పూర్తిగా పారదర్శకంగా జరిగిందని వైసీపీ త‌న ట్వీట్‌లో పేర్కొంది.

లోకేష్ అయితే ఆస్తులను కొట్టేసి పంచాయతీలు చేసి దుబాయ్ (Dubai) ఖాతాలకు తరలించేవాడని వైసీపీ విమర్శించింది. రాష్ట్ర రాజకీయాల్లో “క్యాష్.. సూట్‌కేసు.. రాజేష్‌.. లోకేష్‌” అనే నినాదం వినిపిస్తోందని, అలీబాబా అరడజను దొంగల్లో ఒకడే నారా లోకేష్ అని వైసీపీ తీవ్ర విమ‌ర్శ చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment