ఆంక్షల న‌డుమ YCP ‘అన్నదాత పోరు’

ఆంక్షల న‌డుమ YCP ‘అన్నదాత పోరు’

రాష్ట్రంలో యూరియా కొరతతో పాటు పలు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ‘అన్నదాత పోరు’కి పిలుపునిచ్చింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట నిరసనలు తెలపనున్నారు. ఉల్లి, టమోటా, చీనీ పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వాన్ని నిలదీయడం, రైతుల పంట‌ల‌కు గిట్టుధ‌ర క‌ల్పించేలా ఒత్తిడి చేయ‌డ‌మే ఈ పోరాటం ఉద్దేశ్యం అని వైసీపీ నేతలు స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఆంక్షలు – పోలీసుల నోటీసులు
వైసీపీ నిరసనలను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. అనుమతి లేకుండా నిరసనలు చేస్తే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చి బెదిరిస్తున్నారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. నోటీసులు, అరెస్టులపై చూపుతున్న శ్రద్ధను యూరియా కొరతపై చూపని చంద్రబాబుపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.

వెనక్కి తగ్గేది లేదు: వైసీపీ
పదిమంది, 15 మందితో మాత్రమే నిరసన చేయాలని ఆంక్షలు పెట్టినా, రైతులతో కలిసి ఆందోళనలు ఆపేది లేదని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు పన్నినా రైతుల కోసం పోరాడుతామని, ఉద్యమాలను ఆపడం కష్టమని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆర్డీవో కార్యాలయాల సమీపానికి రైతులు చేరుకోవడంతో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment