రాజ‌శేఖ‌రం మృతికి వైఎస్ జ‌గ‌న్ సంతాపం

రాజ‌శేఖ‌రం మృతికి వైఎస్ జ‌గ‌న్ సంతాపం

వైసీపీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ పాలవలస రాజశేఖరం (78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, శ్రీకాకుళంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పాలవలస రాజశేఖరం ప్రజా సేవకు ఎనలేని కృషి చేశారు. జెడ్పీ ఛైర్మన్‌గా సేవలందించి ప్రజలకు చేరువయ్యారు. అనంతరం రాజ్యసభ ఎంపీగా ఆయన ప‌నిచేశారు. ఆయన మరణం వైసీపీ శ్రేణులతో పాటు మొత్తం రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన కుమారుడు పాలవలస విక్రాంత్ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కుమార్తె మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి 2024లో పాతపట్నం నుంచి వైసీపీ తరపున పోటీ చేశారు.

వైసీపీ సీనియర్ నేత పాలవలస రాజశేఖరం మృతిపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాలవలస రాజశేఖరం మృతిపై సంతాపం వ్యక్తం చేసిన జగన్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. రాజశేఖరం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment