అది నాకు సంతృప్తిని క‌లిగించిన క్ష‌ణం – వైఎస్ జ‌గ‌న్‌

అది నాకు సంతృప్తిని క‌లిగించిన క్ష‌ణం - వైఎస్ జ‌గ‌న్‌

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ (Medical Colleges Privatization) నిర్ణయంపై మాజీ (Former) ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్ (YS Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల క్రితం తాను ఒకేసారి ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించిన రోజును గుర్తు చేసుకుంటూ, ఆ జ్ఞాపకాన్ని ఎక్స్‌ లో పంచుకున్నారు.

“2023 సెప్టెంబర్ 15న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజారోగ్య (Public Health) రంగంలో ఒక గొప్ప రోజు నిలిచిపోయింది. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ఒకేసారి ప్రారంభించడం నా పాలనా కాలంలో అత్యంత సంతృప్తి కలిగించిన క్షణం. 1923 నుంచి 2019 వరకు ప్రభుత్వ రంగంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉండగా, మా హయాంలో 17 కొత్త కాలేజీలను సంకల్పించాం. అందులో భాగంగా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తెచ్చాం” అని జగన్ గుర్తుచేశారు.

ఇక పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలను కూడా అడ్మిషన్లకు సిద్ధం చేశామని తెలిపారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌. “ఈ కాలేజీలు పూర్తిచేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. కానీ వాటిని ప్రైవేటు రంగానికి అప్పగించే నిర్ణయం తీసుకోవడం అత్యంత దారుణం. ప్రజలంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారు” అని జగన్ విమర్శించారు.

తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. “ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం మేము వేసిన పునాదులను ప్రైవేటీకరించడం అన్యాయం” అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment