‘చ‌ర్య‌కు ప్ర‌తిచ‌ర్య తప్పదు’ – వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు

చ‌ర్య‌కు ప్ర‌తిచ‌ర్య తప్పదు- వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు

సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu) ప‌రిపాల‌న తీరుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool district) నేతలతో గురువారం జరిగిన సమావేశం (Meeting) లో వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం (Red Book Constitution) న‌డుస్తోంద‌ని, ఏపీ (AP) లో ప్రజాస్వామ్యం (Democracy) ప్ర‌మాదంలో ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక సంద‌ర్భంగా ఒక పోలీస్‌ ఎస్సై ఎంపీటీసీల వాహనంలో ఎక్కి, వీడియో కాల్‌ ద్వారా ఎమ్మెల్యే, ఆయన కుమారుడితో కలిసి బెదిరింపులకు పాల్పడాడు. టీడీపీ (TDP) కి అనుకూలంగా ఓటేయాలంటూ ఆ పార్టీని ప్రోత్సహించేలా వ్యవహరించాడు. మన ఎంపీటీసీలను మరో మండలానికి తరలించి బైండోవర్ (Bind Over) చేసేందుకు కూడా ప్రయత్నించారు అని జగన్ గుర్తుచేశారు. ఈ దుర్మార్గాలను ప్రశ్నిస్తూ ధర్నాలు చేసిన వారిపై కేసులు పెట్టడం, పార్టీ కార్యకర్త లింగమయ్య (Lingamayya) ను హత్య (Murder) చేయడం వంటి ఘటనలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి దారుణమైన దెబ్బ అని జగన్ అన్నారు.

చర్యకు ప్రతిచర్య తప్పదు
న్యూటన్స్‌ లా (Newton’s Law) ప్రకారం చర్యకు, ప్రతి చర్య (Reaction) ఉంటుంది. చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడతాడో, అంతే వేగంతో అది పైకి లేచి చంద్రబాబుకు తగులుతుందని వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు (Sensational Comments) చేశారు. ప్రజలకు మంచి చేయడమే ప్రజాస్వామ్యమ‌ని, అలా చేయకుండా అధికారం (Power) ఉందని దురహంకారంతో ఏ నాయకుడైనా ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా తిప్పికొడతారన్నారు. చంద్ర‌బాబు వచ్చే ఎన్నికల్లో సింగిల్‌ డిజిట్‌ (Single Digit) కూడా రాని పరిస్థితుల్లోకి వెళ్తారని కీల‌క వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు (Tamil Nadu), ఏపీ (AP) లో జరిగిన గత ఎన్నికలు ప్రజలు ఎలా వన్‌సైడ్‌ (One-Sided) గా తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. ఈ పక్కన ప్రజలు తంతే.. ఆ పక్కన పడతారు అని సెటైర్లు వేశారు. అందుకే చంద్రబాబు భయపెట్టే ప్రయత్నాలు ఎక్కువ చేస్తాడు కాబ‌ట్టి అప్రమత్తంగా, ఐక్యంగా ఉండాలని క్యాడ‌ర్‌కు సూచించారు.

వైసీపీ అంటే బాబుకు భ‌యం
వైసీపీ అన్నా, వైసీపీ కార్య‌క‌ర్త అన్నా చంద్ర‌బాబుకు భ‌య‌మ‌ని, ఆ భ‌యంతోనే చంద్రబాబు అప్రజాస్వామికంగా (Undemocratically) వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని వైఎస్ జ‌గ‌న్ అన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ (Super Six) హామీల అమల్లో, పాలనలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. చంద్రబాబు పాలనలో వ్యవస్థ‌లన్నీ పూర్తిగా నీరుగారిపోయాయని, టీడీపీకి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు సహా కేడర్, నాయకులు ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. టీడీపీ వాళ్లు ప్రజల దగ్గరకు వెళ్తే కచ్చితంగా నిలదీస్తారన్నారు. అలా ప్రజలు ప్రశ్నిస్తారని చంద్రబాబు, ఆయన పార్టీ పరిపాలన చేస్తూ ఇలాంటి దారుణాలకు దిగుతోందన్నారు. ప్రశ్నించే స్వరం ఉండకూడదని, రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణం సృష్టిస్తున్నారన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment