యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య

యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య

Summarize with AI

యూట్యూబ‌ర్ వైష్ణ‌వి భ‌ర్త న‌డిరోడ్డుపై దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. కొబ్బ‌రికాయ‌ల కోసే క‌త్తితో అత్యంత దారుణంగా న‌రికి చంపిన దృశ్యాలు భ‌యాన‌కంగా ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాజారాజేంద్ర చౌరస్తా వద్ద నడిరోడ్డుపై హరిబాబు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కారులో వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని దుండగులు కొబ్బరికాయలు కోసే కత్తితో హరిబాబుపై దాడి చేసి పరార‌య్యారు. తీవ్ర గాయాలతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న రెండో టౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరాల దృశ్యాల సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా ఆరాయి. ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

వైష్ణవి హత్య కేసుతో లింక్ ఉందా?
ఈ ఏడాది మార్చి 17న హ‌రిబాబు చేతిలో నాలుగు నెల‌ల గ‌ర్భిణీ అయిన యూట్యూబ‌ర్‌ వైష్ణ‌వి హ‌త్య‌కు గురి అయిన విష‌యం తెలిసిందే. అదనపు కట్నం కోసం గర్భిణిగా ఉన్న భార్యను హత్య చేసిన కేసులో హరిబాబు నిందితుడిగా ఉన్నాడు. ఇటీవలే బెయిల్‌పై బ‌య‌ట‌కొచ్చాడు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కారులో వ‌చ్చి కొబ్బ‌రికాయ‌ల కత్తితో న‌రికి చంపారు. కాగా, వైష్ణవి హత్య కేసుతో ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందా? లేక పాత కక్షల నేపథ్యంలోనే హరిబాబును హత్య చేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ముగ్గురు నిందితుల కోసం గాలింపు
కారులో వచ్చి హత్య చేసిన ముగ్గురు దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితుల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. హత్యకు అసలు కారణం ఏమిటన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment