ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు విలువలను దిగజార్చేలా ఉన్నాయని, జర్నలిజం ముసుగులో ఆయన రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని వైసీపీ నేలు మండిపడ్డారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ అనుసరిస్తున్న తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున ఆందోళన నిర్వహించాయి.
ముట్టడిలో పాల్గొన్న అగ్రనేతలు
ఈ ఆందోళన కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్, కాకాణి గోవర్ధన్ రెడ్డి సహా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రజ్యోతి కార్యాలయం వైపు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించిన నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు.

రాధాకృష్ణపై వైసీపీ నేతల ఆగ్రహం
ఆందోళన సందర్భంగా వైసీపీ నేతలు రాధాకృష్ణపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాధాకృష్ణ తన రాతల ద్వారా మహిళలను కించపరిచారని, ఆయన తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. “రాధాకృష్ణ చేసేది జర్నలిజం కాదు, అది పక్కా బ్రోకరిజం. ఆయన ఒక చీటర్, బ్రోకర్” అని నేతలు ధ్వజమెత్తారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రికలు కేవలం చంద్రబాబు అజెండాను అమలు చేసే సాధనాలుగా మారాయని, బాబు నోటి నుంచి వచ్చే మాటలనే వీరు రాతలుగా రాస్తున్నారని ఆరోపించారు. రాధాకృష్ణ రాతలు “గజ్జి పట్టిన కులగజ్జి పిచ్చికుక్క రాతలు” అని, జర్నలిజం ముసుగులో ఆయన సైకోయిజం, రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు.
“మీ రోత రాతలతో మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ధైర్యముంటే మేం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మేం నీ గడప ముందుకు వస్తే భయపడి బాత్రూంలో దాక్కున్నావా?” అంటూ నేతలు రాధాకృష్ణను నిలదీశారు. రాధాకృష్ణ చేస్తున్న ఈ నీచమైన వ్యాఖ్యలను, రాతలను చంద్రబాబు నాయుడు గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఖండిస్తారా లేదా అని వైసీపీ నేతలు ప్రశ్నించారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రికలను “టాయిలెట్ పేపర్” తో పోల్చిన నేతలు, ఇటువంటి రాతలకు తాము భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.









