కోహ్లీ మిస్టరీ డ్రింక్.. నెటిజన్లలో జోరుగా చర్చ

కోహ్లీ మిస్టరీ డ్రింక్… నెటిజన్లలో చర్చ జోరుగా

Summarize with AI

సెలబ్రెటీలు ఏం చేసినా వైరల్ కావడం సహాజం. అందులో క్రికెటర్ కోహ్లీ అయితే ఏం చేసినా పెద్ద చర్చ జరుగుతుంటుంది. ఇండోర్ వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్యాటింగ్ మధ్యలో తాగిన బ్రౌన్ కలర్ డ్రింక్ (Brown-Coloured Drink) వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ డ్రింక్ తాగిన తర్వాత కోహ్లీ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ చూసి నెటిజన్లు వింతగా, రకరకాల కామెంట్లతో స్పందిస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ అయితే ఆ డ్రింక్ రుచిని ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారు. క్రికెట్ నిపుణులు, ఫిట్‌నెస్ కోచ్‌ల అభిప్రాయం ప్రకారం, కోహ్లీ తాగిన ఆ మిస్టరీ డ్రింక్ ‘పికిల్ జ్యూస్’ అయి ఉండవచ్చునని, ఇది కండరాల పట్టేయడం (Cramps) తగ్గించడంలో సహాయపడే సప్లిమెంట్ కూడా కావచ్చని విశ్లేషిస్తున్నారు.

అదే సమయంలో, శక్తినిచ్చే ఏదైనా ఇనర్జీ డ్రింక్ అయి ఉండే అవకాశమూ ఉంది. క్రికెట్ ప్రేమికులు ఇప్పుడు కోహ్లీ మిస్టరీ డ్రింక్ ఏమిటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment