విజయ్ దేవరకొండ & రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్?

విజయ్ దేవరకొండ & రష్మిక మందన్నపెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందా?

Summarize with AI

టాలీవుడ్ లోని ప్రముఖ నటులు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మరియు రష్మిక మందన్న (Rashmika Mandanna) వివాహం (Marriage) గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సమాచారం ప్రకారం, ఇద్దరూ అక్టోబర్ 2025లో సమీప కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ జంటకి సంబంధించిన ప్రేమ కథ ఫ్యాన్స్‌కి చాలా ఇంట్రెస్ట్ ని పెంచింది.

ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్
ప్రస్తుతం 26 ఫిబ్రవరి 2026 నాడు ఉదయ్‌పూర్ ప్యాలెస్ (Udaipur Palace) లో అద్భుతమైన డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా సమాచారం ప్రకారం, ఈ వేడుకలో ఫ్యాన్స్‌ని కాకుండా, కేవలం కుటుంబ సభ్యులు మరియు దగ్గరి స్నేహితుల్ని మాత్రమే పాల్గొననుండవచ్చు.

ఈ వెడ్డింగ్ కోసం ప్యాలెస్‌ను ఫైనల్ చేయడం, మొత్తం ఏర్పాట్లు చాలా హుందాగా, ఇండోర్ మరియు ఆవుట్‌డోర్ లో వేడుకల ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని టాక్. తెలుగు సినీ పరిశ్రమలో విజయ్-రష్మిక జంట గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల ద్వారా అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. వారి రియల్‑లైఫ్ ప్రేమ కథను ఫ్యాన్స్ చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment