తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక శైలితో ఆకట్టుకుంటున్న ‘రౌడీ స్టార్’ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. బాక్సాఫీస్ ఫలితాలతో సంబంధం లేకుండా ఆయన ఇమేజ్ అంతర్జాతీయ, జాతీయ స్థాయిల్లో దూసుకుపోతోంది. తాజాగా ప్రముఖ భారతీయ సంప్రదాయ వస్త్ర వ్యాపార సంస్థ ‘రామ్రాజ్ కాటన్స్’ (Ramraj Cotton) తమ నూతన ‘లగ్న వెడ్డింగ్ కలెక్షన్'(Lagna Wedding Collection) బ్రాండ్ అంబాసిడర్‌గా(Brand Ambassador) విజయ్ దేవరకొండను నియమించుకుంది.
స్వచ్ఛమైన పట్టు వస్త్రాలు, ఆధునిక డిజైన్ల కలయికతో నేటితరం ట్రెండ్‌కు తగ్గట్లుగా రూపొందించిన ఈ వెడ్డింగ్ కలెక్షన్‌ను విజయ్ ప్రతిబింబించనున్నారు. సంప్రదాయ వస్త్రధారణకు బ్రాండ్‌గా నిలిచిన రామ్రాజ్ సంస్థ విజయ్ను ఆహ్వానించి ఈ బాధ్యతలను అప్పగించింది.
ఇటీవలే నటి రష్మిక మందన్నను(Rashmika Mandanna) సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ, పెళ్లి తర్వాత తొలిసారిగా ‘రణబాలి’ అనే చిత్రంలో ఆమెతో కలిసి నటిస్తున్నారు. ‘టాక్సీవాలా’ వంటి హిట్ అందించిన రాహుల్ సాంకృత్యాన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ పీరియాడిక్ పేట్రియాటిక్ డ్రామాలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన యోధుడిగా విజయ్ కనిపించనున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకవైపు క్రేజీ ప్రాజెక్ట్‌లతో పాటు, మరోవైపు టాప్ బ్రాండ్ ఎండార్స్మెంట్లతో విజయ్ దేవరకొండ ఫుల్ బిజీగా గడుపుతున్నారు.








