‘వీర హనుమాన్ విజయ యాత్ర’కు భారీ ఏర్పాట్లు!

‘వీర హనుమాన్ విజయ యాత్ర’కు భారీ ఏర్పాట్లు!

హైదరాబాద్ (Hyderabad) నగరం మరోసారి ఆధ్యాత్మిక ఉత్సాహంతో ముంచెత్తేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 2న శ్రీ హనుమాన్ జయంతి (Hanuman Jayanti) సందర్భంగా నిర్వహించనున్న ‘వీర హనుమాన్ విజయ యాత్ర’ (Veera Hanuman Vijaya Yatra)కోసం ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. గత 22 ఏళ్లుగా భజరంగ్‌దళ్ (Bajrang Dal) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ భారీ శోభాయాత్ర ఈసారి కూడా కర్మన్‌ఘాట్ నుంచి ప్రారంభమై గౌలిగూడ (Gowliguda) రామ్ మందిరం (Ram Temple) చేరుకుని, అక్కడి నుంచి సికింద్రాబాద్ తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయం వరకు ఘనంగా కొనసాగనుంది. వేలాదిమంది భక్తులు, హనుమాన్ భజనలు, కాషాయ జెండాలు, విశేష అలంకరణల మధ్య యాత్ర అత్యంత వైభవంగా జరగనుందని నిర్వాహకులు చెబుతున్నారు.

ఈ మహా యాత్రకు సంబంధించి అధికారులు ఇప్పటికే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన సమన్వయ సమావేశంలో పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులు, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ నాయకులు పాల్గొని భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. యాత్ర మార్గంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు అధికారులు రూట్ ఇన్‌స్పెక్షన్ కూడా నిర్వహించారు. మరోవైపు, గత అనుభవాల నేపథ్యంలో యాత్రకు ఎటువంటి ఆంక్షలు విధించకుండా, పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించాలని హిందూ సంఘాల నాయకులు పోలీసులను కోరారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ‘వీర హనుమాన్ విజయ యాత్ర’ మరింత ఘనంగా, నిరాటంకంగా సాగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment