కేరళ లో (Kerala) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి రావడంతో రాజకీయంగా కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా (Chief Minister) వీడీ సతీశన్ (VD Satheesan) సోమవారం తిరువనంతపురం (Thiruvananthapuram) సెంట్రల్ స్టేడియంలో (Central Stadium) ఘనంగా ప్రమాణస్వీకారం(Oath Ceremony) చేశారు. గవర్నర్ (Governor) ఆర్లేకర్ (Arlekar) ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్‌తో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
ఇక సతీశన్ మంత్రివర్గంలో మొత్తం 21 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. సీఎం రేసులో కీలకంగా నిలిచిన చెన్నితల్ కు కూడా కేబినెట్‌లో చోటు దక్కింది. అలాగే కున్‌హల్‌కుట్టి, మురళీధరన్, షాజీ, అబ్దుల్ గఫర్, బషీర్, మోన్స్ జోసెఫ్ తదితరులు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. మహిళా ప్రాతినిధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ తులసి, బిందు కృష్ణలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం విశేషంగా మారింది.








