మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej (వరుణ్ తేజ్) నటిస్తున్న తాజా స్పోర్ట్స్ డ్రామా ‘బరి’ (Bari) సినిమా షూటింగ్ (Shooting) లో అనుకోని ప్రమాదం ) నటిస్తున్న తాజా స్పోర్ట్స్ డ్రామా ‘బరి’ సినిమా షూటింగ్లో అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. వాలీబాల్ ఆటగాడి పాత్ర (Volleyball Role) కోసం గత కొన్ని నెలలుగా కఠినమైన శిక్షణ (Intense training) తీసుకుంటున్న వరుణ్ తేజ్, ప్రాక్టీస్ సమయంలో ఆడుతుండగా కాలికి (Leg) తీవ్ర గాయం అయ్యింది. గాయం తీవ్రంగా (Severe injury) ఉండటంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించారు.
షూటింగ్‌కు బ్రేక్.. విశ్రాంతిలో వరుణ్ తేజ్
ఈరోజు హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స జరగనుంది. డాక్టర్ల సూచన మేరకు సర్జరీ (Surgery అనంతరం ఆయన కొన్ని వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో బరి సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.
సినిమా కోసం అంతగా కష్టపడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. మెగా కుటుంబ సభ్యులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ఆకాంక్షిస్తున్నారు. వరుణ్ తేజ్ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్లో పాల్గొనాలని అందరూ కోరుకుంటున్నారు.








