WPL ఆడేందుకు ట్రాన్స్‌జెండర్ ప్రయత్నాలు!!

WPL ఆడేందుకు ట్రాన్స్‌జెండర్ ప్రయత్నాలు!!

Summarize with AI

భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ లింగమార్పిడి చేయించుకుని, ‘అనయ బంగర్‌’గా మారిన విషయం ఇప్పుడు వార్తల్లో ఉంది. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT) ద్వారా తన పరివర్తన వివరాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్న అనయ, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) గురించి ఊహాగానాలకు దారితీసింది.

ఆ వీడియోలో, అనయ తండ్రి గతంలో కోచ్‌గా పనిచేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) క్రికెట్ కిట్ బ్యాగ్‌తో మైదానంలో ప్రాక్టీస్ చేసింది. మొదట రన్నింగ్ చేసి, ఆ తర్వాత ప్యాడ్స్ కట్టుకుని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వచ్చే WPL సీజన్‌లో అనయ ఆర్సీబీ మహిళా జట్టులో చేరే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.

అయితే, అనయ క్రికెట్ కల నెరవేరడానికి ఐసీసీ నిబంధనలు అడ్డుగా ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయ మహిళా క్రికెట్ నుంచి ట్రాన్స్‌జెండర్ క్రీడాకారులను ఐసీసీ నిషేధించింది. ఈ నేపథ్యంలో, WPLలో అనయకు అనుమతి లభిస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. గతంలో ఓ రియాలిటీ షోలో పాల్గొన్న అనయ, “నేను నా హక్కుల కోసం పోరాడి, ఒక రోజు భారతదేశం తరపున ప్రపంచకప్ గెలుస్తాను” అని భావోద్వేగంగా చెప్పింది. అనయ ఇటీవలి పోస్ట్‌లు ఆమె ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి రావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సూచిస్తున్నప్పటికీ, ప్రస్తుత నిబంధనలు ఆమె కలలకు అడ్డంకిగా ఉన్నాయి. మరి ఆమె క్రికెట్ ఆడాలనే లక్ష్యం నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment