తిరుమల లడ్డూ వివాదానికి (Tirumala Laddu Controversy) సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court of India) కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పనిచేస్తున్న నేపథ్యంలో మరో ఏకసభ్య కమిషన్ (Single-Member Commission)ఏర్పాటు చేయడం సరికాదని స్పష్టం చేసింది. విచారణ పాలనాపరమైన అంశాలకే పరిమితం కావాలని, చట్టబద్ధ ప్రక్రియలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.
ఈ కేసులో దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant), జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి (Justice Joymalya Bagchi) ధర్మాసనం విచారణ జరిపింది. సిట్ నివేదికపై కొత్త కమిటీ వేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), సిబిఐ(CBI), టీటీడీ(TTD)లను చేర్చారు.
కేసులో ఇప్పటికే సిట్‌ను కోర్టే నియమించిందని, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ (Retired IAS Officer) దినేష్ కుమార్ (Dinesh Kumar) నేతృత్వంలో మరో కమిటీ ఏర్పాటు చేయడం సరైంది కాదని కోర్టు అభిప్రాయపడింది.
మరోవైపు లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలను ఎన్‌డీఆర్‌ఐ (NDRI), ఎన్‌డీడీబీ (NDDB) నివేదికలు ఖండించాయి. చార్జ్‌షీట్‌లో కూడా ఆ అంశం స్పష్టమైందని సిబిఐ తెలిపింది. రాజకీయ నాయకుల పేర్లు చేర్చలేదని వెల్లడించింది.
ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కమిటీ ఏర్పాటు వెనుక ఉద్దేశ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ పరిధిని దాటి విచారణ జరపకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ కేసును ముగించింది.
తిరుమల లడ్డూ కేసులో కొత్త ట్విస్ట్… సుప్రీంకోర్టు ఆగ్రహం!








