తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumala Tirupati Devasthanams) సంబంధించి రోజుకో వార్త హల్‌చల్ చేస్తోంది. కొండపై జరుగుతున్న కొన్ని కొన్ని సంఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ఇటీవల మద్యం బాటిళ్లు (Alcohol Bottles), మాంసాహారాలు (Non-Vegetarian Food) దర్శనమివ్వగా, బోర్డు మెంబర్ టీటీడీ ఉద్యోగి (TTD Employee)ని దుర్భాషలాడటం, మద్యం సేవించిన ఓ వ్యక్తి శ్రీవారి మాడవీధుల్లో (Srivari Mada Street) హంగామా సృష్టించిన విషయం కూడా తెలిసిందే. తాజాగా తిరుమల (Tirumala)కు సంబంధించిన ఓ వార్త భక్తులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది.
శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీవారి ఆలయంలోకి పాదరక్షలతో (Footwear) వెళ్లేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. ఆలయ మహాద్వారం వద్ద భద్రతా సిబ్బంది ఈ విషయం గమనించి, భక్తులను అడ్డుకున్నారు. భక్తులు అక్కడే తమ పాదరక్షలను వదిలి, ఆలయంలోకి ప్రవేశించారు.
విజిలెన్స్ (Vigilance), TTD ఉద్యోగులు ఆలయంలోకి ప్రవేశించే సమయంలో భక్తులను గుర్తించకపోవడంతో ఇది సంభవించిందని తెలుస్తోంది. ఆలయ నియమాల ప్రకారం, పాదరక్షలతో ఆలయ పరిసర ప్రాంతాల్లో సంచరించకూడదన్న నిబంధన ఉంది. కానీ ఉద్యోగులు పట్టించుకోకపోవడంతో చెప్పులతో(Slippers) ఆలయ మహాద్వారం (Temple Entrance) వరకు భక్తులు వచ్చారని శ్రీవారి భక్తులు (Devotees) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.