పాకిస్తాన్‌పై తెలుగోడి సత్తా..

పాకిస్తాన్‌పై తెలుగోడి సత్తా..

ఆసియా కప్ (Asia Cup) ఫైనల్లో(Final) భారత్ (India) ఘనవిజయం సాధించింది. ఈ విజయానికి హైదరాబాదీ (Hyderabadi) యువ క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma) కీల‌కంగా నిలిచాడు. పాకిస్తాన్ (Pakistan) బౌలర్ల దాడిని తట్టుకుని, తిలక్ 69 పరుగులతో అజేయంగా నిలిచాడు. క్రీజ్‌లో చివ‌రి వ‌ర‌కు నిల‌బ‌డి ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశాడు. టీమిండియాను విజ‌య‌తీరానికి చేర్చాడు.

హైదరాబాద్‌లో జన్మించిన తిలక్ వర్మ చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. తండ్రి BHELలో ఉద్యోగం చేస్తూ, తన కొడుకు ఆటగాడిగా ఎదగడానికి పూర్తి సహకారం అందించారు. అండర్-19 స్థాయిలో రాహుల్ ద్రవిడ్ శిక్షణలో తిలక్ తన ప్రతిభను చాటుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు.

2022లో ముంబై ఇండియన్స్ అతని ప్రతిభను గుర్తించి ఐపీఎల్‌లోకి తీసుకుంది. అక్కడనుంచి అతని కెరీర్‌కు కొత్త ఊపిరి లభించింది. ఆ తరువాత 2023లో టీమిండియాలో అరంగేట్రం చేసిన తిలక్ ఇప్పటివరకు 32 T20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 962 పరుగులు సాధించాడు. అందులో 2 సెంచరీలు ఉండటం అతని ప్రతిభకు నిదర్శనం.

సగటు 53తో క్రమంగా రాణిస్తున్న తిలక్ వర్మ భవిష్యత్తు స్టార్‌గా ఎదుగుతున్నాడని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆసియా కప్ ఫైనల్లో అతని అద్భుత ప్రదర్శనతో తెలుగు యువకుడు (Telugu Youth) మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా (Prowess) చాటుకున్నాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment