‘తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఖబర్దార్!’

'తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఖబర్దార్!'

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీరుపై తెలంగాణ (Telangana) నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు (Telangana Nava Nirmana Sankalpa Sabha) అనుమతి నిరాకరణ, ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు (Professor Nageswara Rao) వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ శ్రేణులు ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో తుంగతుర్తి ఎమ్మెల్యే (Thungathurthi MLA) సామేల్ (Samel) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొట్లాడి, పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్ర పెత్తందారుల పెత్తనం ఏంటని ఆయన నిలదీశారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత తాను బాధతో 11 రోజులు పస్తులు ఉన్నానని పవన్ కళ్యాణ్ మాట్లాడటంపై ఎమ్మెల్యే సామేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “తెలంగాణ వచ్చినందుకు పస్తులు ఉన్నాననడం.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకంపై విషం కక్కడం కాదా? అసలు తెలంగాణ రావడం ఇష్టం లేకనే పవన్ కళ్యాణ్ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఖబర్దార్ పవన్ కళ్యాణ్” అని ఆయన హెచ్చరించారు.

కత్తులతో కోలాటం ఆడుతాం
“తెలంగాణలో ఎవరైనా ప్రశాంతంగా బతకొచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ ఇక్కడి వ్యవస్థలపైన, తెలంగాణ ఆత్మగౌరవంపైన దెబ్బకొట్టాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. ఎవరైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కత్తులతో కోలాటం ఆడుతాం” అంటూ ఎమ్మెల్యే తీవ్ర పదజాలంతో హెచ్చరించారు.

సినిమాలు వేరు.. ఆత్మగౌరవం వేరు!
పవన్ కళ్యాణ్‌కు తెలంగాణలోనూ అభిమానులు, ఆయన సినిమాలు చూసేవాళ్లు ఉన్నారని.. అయితే సినిమా క్రేజ్‌ను రాజకీయ పెత్తనానికి వాడుకోవద్దని సామేల్ హితవు పలికారు. సినిమాలు వేరని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం వేరని పేర్కొన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను (Telangana Sentiment), ఇక్కడి ప్రజల భావోద్వేగాలను గాయపరిచేలా మాట్లాడితే జనసేన అధినేతకు తెలంగాణ సమాజం తగిన బుద్ధి చెపుతుందని ఆయన హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment