న్యాచురల్ స్టార్ నాని(Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’(The Paradise)పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘దసరా’ (Dasara) తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ (Ram-Laxman) ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలపై (Action Sequences) ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
‘దసరా’తో పోలిస్తే ‘ది ప్యారడైజ్’లో యాక్షన్ సీక్వెన్స్‌లు రెండు, మూడు రెట్లు భారీగా ఉంటాయని రామ్-లక్ష్మణ్ తెలిపారు. టీజర్లో కనిపించిన దానికంటే సినిమాలో వైలెన్స్ మరింత తీవ్రంగా ఉంటుందని, ఫైట్ల (Fights) మధ్యే కథ సాగుతుందని చెప్పారు. రెండు యాక్షన్ బ్లాక్స్‌ను రూపొందించడానికి సుమారు 20 రోజులు పట్టిందని వెల్లడించారు.
ఇక సినిమాలో నాని లుక్, బాడీ లాంగ్వేజ్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని తెలిపారు. రెండు జడలతో(Two Braids) బేర్బాడీగా (Bare Body) కనిపించే పాత్ర కోసం నాని ఎంతో కష్టపడ్డారని, డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నారని చెప్పారు. కఠినమైన డైట్, వర్కౌట్స్‌తో నాని పాత్ర కోసం సిద్ధమయ్యారని ప్రశంసించారు. శ్రీకాంత్ ఓదెల పట్టుదల, నాని డెడికేషన్‌తో ‘ది ప్యారడైజ్’లో సరికొత్త యాక్షన్ అనుభూతి ప్రేక్షకులకు లభిస్తుందని రామ్-లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.








