తమన్‌కు కోపం తెప్పించిన నెటిజన్…”అడ్రస్ పంపు బే” అంటూ తమన్ కౌంటర్!

తమన్‌కు కోపం తెప్పించిన నెటిజన్.."అడ్రస్ పంపు బే" అంటూ తమన్ కౌంటర్!

Summarize with AI


ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటారు. పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ, ఫాలోవర్స్ పోస్ట్‌లకు రిప్లై ఇస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఓ నెటిజన్ చేసిన కామెంట్ తమన్‌కు కోపం తెప్పించింది.

తమన్ సంగీతంతో పాటు క్రికెట్ అంటే కూడా చాలా ఇష్టపడతారు. సీసీఎల్ (CCL) లీగ్‌లో తెలుగు వారియర్స్ టీమ్‌లో కీలక ప్లేయర్‌గా కూడా ఉన్నారు. ఇటీవల తన క్రికెట్ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఒక వీడియోను షేర్ చేస్తూ “డోంట్ బౌల్ షార్ట్ బాల్ బ్రో” అని పోస్ట్ చేశారు.

“అడ్రస్ పంపు బే” అంటూ తమన్ కౌంటర్!
తమన్ షేర్ చేసిన ఆ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ, “షార్ట్ కు.. స్లాట్ కు తేడా తెలియనప్పుడే నాకు అర్థమైంది.. నువ్వు ధోని ఫ్యాన్” అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. ఈ కామెంట్ చూసిన తమన్ తన స్టైల్లో “ఒకే రా.. వచ్చి నేర్చుకుంటా అడ్రస్ పంపు బే” అంటూ రిప్లై ఇచ్చారు.

తమన్ ఇచ్చిన ఈ రిప్లై ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తమన్ చెప్పింది కరెక్ట్ అని, తెలియకుండా కామెంట్ చేసిన సదరు నెటిజన్‌ను విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం, ఇలాంటి కామెంట్స్ పట్టించుకోవద్దని తమన్‌కు సలహా ఇస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment