తెలంగాణ (Telangana) రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) జీవితం ఆధారంగా ‘శ్రీనన్న అందరివాడు (Srinanna Andarivadu)’ అనే పేరుతో బయోపిక్ (Biopic) రాబోతోంది. ఈ సినిమాలో పొంగులేటి పాత్రను సీనియర్ నటుడు సుమన్(Suman) పోషించనున్నారు. ఈ చిత్రం ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని చూపించనుంది. ఈ సినిమాకు బయ్యా వెంకట నర్సింహ రాజ్ (Bayya Venkata Narasimha Raj) దర్శకత్వం వహిస్తూ, కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
‘శ్రీనన్న అందరివాడు’ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడతో పాటు అస్సామీ భాషల్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంగీతాన్ని శ్రీ వెంకట్ అందిస్తుండగా, కాసర్ల శ్యామ్ పాటలు రాస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోస్టర్‌లో నటుడు సుమన్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కనిపిస్తున్నారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ జీవితం 2014లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందడంతో మొదలైంది. ఆ తర్వాత ఆయన టీఆర్‌ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్) పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజుకు మద్దతు ఇచ్చారు. 2023లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. అదే ఏడాది జూలైలో ఖమ్మంలో రాహుల్ గాంధీ సమక్షంలో జరిగిన ‘తెలంగాణ జన గర్జన’ సభలో కాంగ్రెస్‌లో చేరారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచి ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.









ఇకపై ‘దొరసాని’ని చూస్తారు – కవితపై బీజేపీ ఎంపీ సెటైర్లు