తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు రిజర్వ్

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు రిజర్వ్

Summarize with AI

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ అంశంపై ఎన్నికల కమిషన్, తెలంగాణ ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలను విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ దాదాపు ఆరు పిటిషన్లు హైకోర్టులో దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై గత కొన్నాళ్లుగా వాదనలు కొనసాగుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు తమకు నెల రోజుల గడువు కావాలని ప్రభుత్వం కోరగా, ఎన్నికల సంఘం మాత్రం 60 రోజుల గడువును కోరింది.

ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఈ కేసుపై తన తీర్పును వాయిదా వేసింది. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment