తెలంగాణలో అంత‌ర్జాతీయ బ్రాండ్లు.. మందుబాబుల‌కు గుడ్‌న్యూస్‌

తెలంగాణలో అంత‌ర్జాతీయ బ్రాండ్లు.. మందుబాబుల‌కు గుడ్‌న్యూస్‌..

Summarize with AI

తెలంగాణ (Telangana) మద్యం (Liquor) ప్రియులకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ (Excise Department) గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో త్వరలో మరిన్ని అంతర్జాతీయ మద్యం బ్రాండ్లు (International Liquor Brands) అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSBCL) ఏర్పాట్లు చేస్తోంది.

18 ప్రముఖ సరఫరా సంస్థలకు చెందిన 121 రకాల నూతన లిక్కర్ బ్రాండ్లను (Liquor Brands) రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ బ్రాండ్లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సంబంధించిన ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ (Excise and Prohibition Department) నోటిఫికేషన్ జారీ చేసింది.

కొత్త మద్యం బ్రాండ్ల ప్రవేశంపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 1వ తేదీలోపు తెలియజేయాలని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. నిర్దేశిత గడువులోగా అందిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. కొత్త బ్రాండ్ల రాకతో తెలంగాణలో మద్యం మార్కెట్‌లో మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment