హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఒక ప్రజాప్రతినిధి.. ఇప్పుడు ఏలూరులో చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులకే వింత నీతులు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. రోడ్డు ప్రమాదాలను అరికట్టి, అమాయకుల ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు నిర్వహించే ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలపై ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి.
ఏలూరులో జరిగిన ఒక అధికారిక సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా మద్యం తాగి వాహనాలు నడిపే వారిని ప్రోత్సహించేలా ఉన్నాయి.
“డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులకు కొంచెం సపోర్ట్ చేయండి. ఈ కేసుల వల్ల మా పార్టీ వాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు రోజుకు 30 ఫోన్లు వీటి గురించే వస్తున్నాయి. తాగి దొరికిన వాళ్లపై కేసులు రాస్తే వాళ్లు ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారు. దీనివల్ల మా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు అని టీడీపీ ఎంపీ పోలీసులకు వింత ప్రపోజల్ పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో మా పార్టీ మండల అధ్యక్షులకు కొంచెం సపోర్ట్ చేయండి
— Telugu Feed (@Telugufeedsite) June 25, 2026
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వల్ల ఇబ్బందులు మా పార్టీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు
రోజుకు 30 ఫోన్లు వాటి గురించే వస్తున్నాయి
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వల్ల మా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు
-… https://t.co/7Wlc3H1XYh pic.twitter.com/VW9SxbNF1E
మనిషి ప్రాణం విలువ తెలుసా?
పుట్టా మహేష్ వ్యాఖ్యలపై నెటిజన్లు, విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. గతంలో హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీలో దొరికిపోయిన ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. “మత్తు విలువ తెలిసిన ఎంపీకి, సామాన్య మనిషి ప్రాణం విలువ ఎలా తెలుస్తుంది?” అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఎందుకు చేస్తారో చట్ట సభల్లో కూర్చునే ఎంపీకి తెలియదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాగి బండి నడిపితే సదరు వ్యక్తి ప్రాణానికే కాకుండా, రోడ్డుపై వెళ్లే వందలాది మంది అమాయకుల ప్రాణాలకు ముప్పు. ప్రమాదాలను అరికట్టేందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతారు. తన పార్టీ కేడర్ ఓట్ల కోసం, వాళ్ల తిట్ల నుంచి తప్పించుకోవడం కోసం చట్టాన్ని పక్కనబెట్టమమనడం ఎంతవరకు సమంజసం?
పుట్టా మహేష్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలు పరోక్షంగా తాగుబోతులను, చట్టాన్ని ఉల్లంఘించే వారిని వెనకేసుకురావడమే అవుతుంది. ఇది టీడీపీ కేడర్‌లో విచ్చలవిడితనాన్ని, తాము ఏం చేసినా చెల్లుతుందనే అహంకారాన్ని పెంచడానికే తోడ్పడుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.









కొత్త అమ్మాయిలకు ఇండస్ట్రీ సేఫ్ కాదు – సింగర్ సునీత