శుభకార్యంలో కొట్టుకున్న టీడీపీ–జనసేన నేతలు

శుభకార్యంలో కొట్టుకున్న టీడీపీ–జనసేన నేతలు

Summarize with AI

కూట‌మి పార్టీల నేత‌లు (Alliance Leaders) కొట్టుకున్నారు (Fought). మామూలుగా రాజ‌కీయ స‌భో, అంత‌ర్గ‌త స‌మావేశ‌మో కాదు.. శుభ‌కార్యానికి వెళ్లి అధికార పార్టీల‌కు చెందిన నాయ‌కులు త‌న్నుకోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది. కాకినాడ జిల్లా (Kakinada District) కొండ గైరంపేటలో టీడీపీ (TDP) మరియు జనసేన (JanaSena) కార్యకర్తల మధ్య ఉద్రిక్తత (Tension) చోటుచేసుకుంది. ఒక టీడీపీ నేత శుభకార్యానికి (Function) ఇరు పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన నేతలు “మా అండతోనే టీడీపీ విజయం సాధించింది, అధికారానికి (Power) జ‌న‌సేనే కారణం” అంటూ చేసిన వ్యాఖ్యలు వాగ్వాదానికి దారితీశాయి.

మొద‌ట ఇరుపార్టీల నేత‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, మాటామాటా పెరిగి, ఉద్రిక్తంగా మారి కొట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో పలువురికి గాయాలు అయిన‌ట్లుగా తెలుస్తోంది. పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం ఉండగా, పార్టీ పెద్దలు మధ్యలో ప్రవేశించి వివాదాన్ని స‌ర్ధిచెప్పారు. టీడీపీ-జ‌న‌సేన నేత‌ల మ‌ధ్య గొడ‌వ‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోష‌ల్ మీడియా (Social Media)లో వైర‌ల్‌గా మారాయి. కూట‌మి గెలిచి సంవ‌త్స‌ర కాలం కూడా పూర్తికాక ముందే గ్రామాల్లో ప‌రిస్థితి ఇలా ఉంటే.. మున్ముందు ప‌రిస్థితులు ఎలా ఉంటుందోన‌న్న ఆందోళ‌న ఇరు పార్టీల అగ్ర‌నాయ‌క‌త్వంలో నెల‌కొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment