గణాంకాలు చూడండి.. భారత్-పాక్ మధ్య పోటీ లేనే లేదు: సూర్యకుమార్ యాదవ్

గణాంకాలు చూడండి.. భారత్-పాక్ మధ్య పోటీ లేనే లేదు: సూర్యకుమార్ యాదవ్

ఆసియా కప్ 2025లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దుబాయ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను ఇకపై “పోటీ” అని పిలవవద్దని వ్యాఖ్యానించారు.

ఒక పాకిస్థానీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, సూర్యకుమార్ ఈ విషయాన్ని నవ్వుతూ ప్రస్తావించారు. “రెండు జట్ల మధ్య 15 మ్యాచ్‌లు జరిగితే స్కోరు 8-7 ఉంటే అది పోటీ. కానీ ఇక్కడ 12-3 లేదా 13-1 ఉంది. ఇది ఏ విధంగానూ పోటీ కాదు” అని ఘాటుగా సమాధానమిచ్చారు.

సూర్యకుమార్ మాట్లాడుతూ, ఏ జట్టు బాగా ఆడుతుందనేదే తనకు ముఖ్యమని, తమ జట్టు బౌలింగ్ విభాగంలో మెరుగ్గా రాణించిందని ప్రశంసించారు. అలాగే, ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఆటతీరును కొనియాడారు. అభిషేక్ గురించి మాట్లాడుతూ, అతనికి ఏం చేయాలో తెలుసని, బౌలర్లను అర్థం చేసుకోగలడని అన్నారు. ఈ టోర్నీలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెప్టెంబర్ 28న ఫైనల్‌లో తలపడతాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment