ఫ్యాన్స్‌ ఆన్‌లైన్ వార్స్‌కు ఫుల్‌స్టాప్.. సూర్య కీలక సందేశం

ఫ్యాన్స్‌ ఆన్‌లైన్ వార్స్‌కు ఫుల్‌స్టాప్.. సూర్య కీలక సందేశం

Summarize with AI

సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ మధ్య జరిగే ఆన్‌లైన్‌ వార్స్‌, అనవసరమైన ట్రోలింగ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య తన అభిమానులకు సూచించారు. ఇటీవల అభిమాన సంఘాల ముఖ్య సభ్యులతో సమావేశమైన ఆయన.. సోషల్‌ మీడియాలో ఎవరైనా ట్రోల్‌ చేసినా, విమర్శించినా తిరిగి స్పందిస్తూ సమయం, శక్తిని వృథా చేసుకోవద్దని చెప్పారు. ఎదుటివారిని మార్చడం మన చేతుల్లో ఉండదని, విమర్శలకు స్పందించకుండా మన పని, లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. “వాళ్లను వాళ్లలాగే వదిలేద్దాం.. మనం మాత్రం ప్రేమను పంచుదాం” అంటూ అభిమానులకు దిశానిర్దేశం చేశారు.

సూర్య ఎవరినీ నేరుగా ప్రస్తావించకపోయినా.. ఇటీవల తమిళ సినీ పరిశ్రమలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు అభిమానుల్లో చర్చ జరుగుతోంది. హీరో శివకార్తికేయన్‌ కొన్ని సినిమాల బృందాలను అభినందిస్తూ చేసిన సోషల్‌ మీడియా పోస్టుల నేపథ్యంలో ఇరువర్గాల అభిమానుల మధ్య ట్రోలింగ్‌, విమర్శలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే సూర్య వివాదాలకు దూరంగా ఉండాలని తన అభిమానులకు హితవు పలికినట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఇక సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘కరుప్పు’, ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారిస్తున్నారు. సినిమాల పరంగానే కాకుండా అభిమానులు సోషల్‌ మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచిస్తూ సూర్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment