ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి (A. Revanth Reddy) సిరిసిల్ల (Sircilla) పర్యటన నేపథ్యంలో బీఆర్‌ఎస్(BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్(KTR) బహిరంగ లేఖ రాశారు. పర్యటనలో రాజకీయ విమర్శలకు బదులుగా సిరిసిల్ల ప్రజల సమస్యలు, కాంగ్రెస్ ఎన్నికల హామీల (Congress Election Promises) అమలుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనుల పెండింగ్ బకాయిలను (Pending Dues) విడుదల చేయడంతో పాటు, 2,400 ఎకరాల భూముల రికవరీపై వివరాలతో శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేనేత రంగానికి 10 శాతం యార్న్ సబ్సిడీ, రూ.5 లక్షల నేతన్న బీమా, యార్న్ డిపో, వీవింగ్ పార్క్, అపారెల్ పార్క్ అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.
రైతుబంధు(Rythu Bandhu), రూ.2 లక్షల రుణమాఫీ(₹2 Lakh Loan Waiver), రైతుబీమా (Rythu Bima) అమలు, మల్కపేట–అప్పర్ మానేరు నీటి తరలింపుపై తేదీలు ప్రకటించాలని కేటీఆర్ కోరారు. సిరిసిల్లకు కొత్త పరిశ్రమలు, ఆక్వా హబ్, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల పురోగతిపై స్పష్టత ఇవ్వాలని, జేఎన్‌టీయూ కాలేజీ, ‘మన ఊరు–మన బడి’ (Mana Ooru–Mana Badi) పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి, కల్యాణలక్ష్మి, ఆటో డ్రైవర్ల సాయం, ఆసరా పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర ఎన్నికల హామీల అమలుకు తేదీలు ప్రకటించాలని, సీఈఎస్‌ఎస్ రద్దు, ‘ఏక్ పోలీసు’ (One Police) హామీలపై కూడా సీఎం స్పష్టత ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.








