దేశ అత్యున్నత న్యాయస్థానంలో వైసీపీ (YSRCP) ఎంపీ మిథున్‌రెడ్డి (Mithun Reddy) కి ఊరట (Relief) లభించింది. లిక్కర్ అమ్మకాలపై ఇటీవల తనపై ఏసీ సీఐడీ (AP CID) అధికారులు నమోదు చేసిన కేసులో ఆయన సుప్రీంను ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పోలీసులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు (Arrest) చేయొద్దని ఆదేశించింది.
మద్యం (Liquor) కేసులో ఏపీ సీఐడీ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) ఉత్తర్వులు జారీ చేసింది. మిథున్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సింగ్వి (Singhvi) వాదనలు వాదనలు వినిపించారు. కాగా, మద్యం అమ్మకాలపై సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఎంపీ మిథున్‌రెడ్డి మొదట ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కేసులో మిథున్‌రెడ్డిని నేరస్తుడిగా పేర్కొననందున అరెస్టు అనే ప్రశ్న ఉత్పన్నం కాదని కోర్టు అభిప్రాయపడుతూ పిటీషన్‌ను కొట్టివేసింది.
హైకోర్టు పిటీషన్ కొట్టివేయడంతో ఏపీ సీఐడీ అధికారులు ఢిల్లీకి వెళ్లి హడావిడి చేశారు. ఎంపీ మిథున్‌రెడ్డిపై నిఘా పెంచారు. అప్రమత్తమైన వైసీపీ ఎంపీ.. సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్‌ను విచారణకు స్వీకరించి, వాదనలు విన్న సుప్రీం కోర్టు.. తదుపరి విచారణ వరకు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేయొద్దని ఆదేశించింది.








